టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ | - | Sakshi
Sakshi News home page

టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ

Jul 15 2026 1:16 AM | Updated on Jul 15 2026 1:16 AM

ఎం.అలమండ పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీని

పర్యవేక్షిస్తున్న ఏవో కాంతమ్మ, ఎస్‌ఐ సత్యనారాయణ

ఎరువుల కోసం క్యూలైన్‌లో రైతులు

దేవరాపల్లి : మండలంలోని ఎం.అలమండ పీఏసీఎస్‌లో మంగళవారం టోకెన్‌ సిస్టమ్‌ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు. స్థానిక సొసైటీలో సోమవారం యూరియా కోసం అన్నదాతలు రోజంతా క్యూలైన్లలో నిరీక్షించి నానా అగచాట్లు పడ్డారు. దీనిపై సాక్షిలో ప్రచురితమైన ‘యూరియా కోసం మండుటెండలో’ కథనానికి అధికారులు స్పందించారు. మండల వ్యవసాయ అధికారి ఎల్‌.వై.కాంతమ్మ, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఎరువుల పంపిణీని పర్యవేక్షించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌ సిస్టమ్‌ ద్వారా పోలీసు బందోబస్తు నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement