● రీజనల్ మేనేజర్ సతీష్‌చంద్ర
ముంచంగిపుట్టు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కల్పిస్తున్న సేవలను మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఎస్.సతీష్ చంద్ర పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంక్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రీజినల్ మేనేజర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ, గతంలో బ్యాంక్ కొనసాగిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చామని తెలిపారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ నూతన కార్యాలయంలో బ్యాంకింగ్ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సురేష్ కుమార్, బ్యాంక్ మిత్రలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


