పాడేరు: జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన జిల్లా ఆస్పత్రిలోని వివిధ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లోని రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, భోజన వసతి, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. రోగుల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణం లోపల, బయట పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు ఏవైనా సమస్యలు ఎదురైతే, వెనుకాడకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన రోగులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
డాక్టర్ శ్రీనివాసరావు


