డాబాగార్డెన్స్: ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టర్నర్ చౌల్ట్రీలో నిర్వహిస్తున్న ఏపీ హస్తకళా మహోత్సవాన్ని శుక్రవారం సంస్థ డైరెక్టర్ జి.జీవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 వరకు హస్తకళల ప్రదర్శన–విక్రయాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రజలు నేరుగా కళాకారుల నుంచి హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి సంప్రదాయ కళలు, నైపుణ్యం, జీవనోపాధికి తోడ్పాటు అందించాలని కోరారు. ప్రదర్శనలో ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట కళాఖండాలు, కలంకారీ చీరలు, కలంకారీ చిత్రాలు, ఇమిటేషన్ ఆభరణాలు తదితర హస్తకళా ఉత్పత్తులను విక్రయానికి ఉంచినట్లు వివరించారు.


