ఆ రాతలు అత్యంత నీచం –మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు | - | Sakshi
Sakshi News home page

ఆ రాతలు అత్యంత నీచం –మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి.

అది బూతుల కరపత్రం

–మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాధాకృష్ణ తనకు తోచినట్లు రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాలో ఆయన ఒక ’ఎల్లో టెర్రరిస్ట్‌’. ఆంధ్రజ్యోతి అనేది ఒక బూతుల కరపత్రంలా మారింది. కేవలం చిల్లర కోసం రాధాకృష్ణ ఇన్ని వేషాలు వేస్తున్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement