ఆలయంలో హుండీ లెక్కింపు
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం గత సంవత్సరం కన్నా రూ.1,38,933 తగ్గింది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహాత్సవాలు జరిగాయి. గురువారం ఆలయంలో స్వామి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీ ద్వారా రూ.7,60,700, టిక్కెట్ల ద్వారా రూ. 2,99,895,తలనీలాల ద్వారా రూ.25 వేలు,కొబ్బరి చిప్పల వేలం ద్వారా రూ.33 వేలు,ఆశీల ద్వారా రూ.8 వేలు,విరాళాలు రూ.616 తదితర మార్గాల ద్వారా మొత్తం రూ.11,33,211 ఆదాయం స్వామి వారికి వచ్చిందన్నారు. 430 మిల్లీగ్రాముల బంగారం,101 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్లు ఈవో శర్మ తెలిపారు. గత ఏడాది ఉత్సవాలు సందర్భంగా స్వామి వారికి రూ. 12,72,144లు ఆదాయం రాగా ఈ ఏడాది ఆదాయం తగ్గిందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్త దొండా కన్నబాబు,సూపర్ వైజర్ మురళీ, దేవాదాయశాఖ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


