మోదమ్మకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

మోదమ్మకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పూజలు

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

మోదమ్

మోదమ్మకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పూజలు

సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత పాడేరులోని మోదకొండమ్మతల్లిని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో పాటు నేతలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రితో పాటు అరకు పార్లమెంట్‌ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్‌, అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకులు ఏడువాక సత్యారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యలు మోదమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి అమర్‌నాఽథ్‌, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజులు ప్రారంభించి, భక్తులకు వడ్డించారు. మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, వైస్‌ ఎంపీపీ కనకాలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్గన్నదొర, మహిళా విభాగ నియోజకవర్గ అధ్యక్షురాలు ఉర్వశిరాణి, ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్‌, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుసారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పాఠశాలల వివరాలు

పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 12 512 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 7 337 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 110 5459 గిరిజన సంక్షేమ గురుకులాలు 9 775 కేజీబీవీలు 11 436 ప్రైవేట్‌ పాఠశాలలు 10 285 మొత్తం 159 7804

మోదమ్మకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పూజలు 1
1/1

మోదమ్మకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement