అధికారుల నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మరణాలు
జి.మాడుగుల: అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంత పాఠశాలల్లో ఏదో కారణంగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, మండల అధికారులు, సిబ్బందిపై పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జి.మాడుగుల మండలంలో చుట్టుమెట్ట గ్రామానికి చెందిన, స్థానిక ఏకలవ్య మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కిల్లో ఆల్బర్ట్ ఫిలిప్స్(14) గెడ్డలో ఈతకు వెళ్లి మణించిన సంఘటనా స్థలానికి శనివారం ఎమ్మెల్యే చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు విధిగా పాఠశాలలను పర్యవేక్షించాలని ఆయన కోరారు.బాధిత కుటుంబానికి అధికారులు అండగా ఉండాలని ఆయన సూచించారు. మృతికి చెందిన కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతో పాటు ఔట్‌సోర్సింగ్ పద్థతిపై మృతి చెందిన విద్యార్థి కుంటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత ఇవ్వటానికి ఆయన సమక్షంలో ఒప్పందం జరిగింది. కిముడు రాంబాబు, గెమ్మెలి సర్పంచ్ సీదరి కొండబాబు, ఏటీడబ్లూవో, ఓఎస్‌డీలు పాల్గొన్నారు.
వరుస మరణాలు సంభవిస్తున్నా
పట్టించుకోని ప్రభుత్వం
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు


