క్లీన్‌ ఆర్గానికి జిల్లా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్లీన్‌ ఆర్గానికి జిల్లా లక్ష్యం

Feb 22 2026 7:25 AM | Updated on Feb 22 2026 7:25 AM

క్లీన్‌ ఆర్గానికి జిల్లా లక్ష్యం

క్లీన్‌ ఆర్గానికి జిల్లా లక్ష్యం

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

సాక్షి,పాడేరు: పచ్చదనం, పరిశుభ్రతతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, క్లీన్‌ ఆర్గానిక్‌ జిల్లా లక్ష్యమని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ అన్నారు.జీరో వేస్ట్‌ లిట్టర్‌ గవర్నెన్స్‌ నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్చాంఽధ్ర కార్యక్రమాన్ని పంచాయతీ కేంద్రం తుంపాడలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించారు.కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పరిశుభ్రత ,పచ్చదనం కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు.ఆలాగే మొక్కలు నాటారు.తడి, పొడి చెత్తను సేకరించే ఈ–ఆటోలు, ట్రైసెకిళ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో గ్రామంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు తడి,పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు.సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఖచ్చితంగా అమలుజేయాలన్నారు. ప్రజలంతా నార సంచులను వినియోగించాలని సూచించారు.పాలిథిన్‌ కవర్లు విక్రయిస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, సర్పంచ్‌ సూర్యకాంతం, డీపీవో చంద్రశేఖర్‌, డీఎల్‌డీవో జయప్రకాష్‌, డీఎల్‌పీవో పి.ఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement