అన్ని వర్గాలకు అన్యాయం
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, ఆడ బిడ్డలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు గుప్పించారు. ఆయన మాటలు, హామీలు నమ్మినందుకు నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించి అన్యాయం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పేద, మధ్య తరగతి కుటుంబాలను పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలి.
– మజ్జి చంద్రుబాబు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, పెదబయలు


