వచ్చే నెల 14న జాతీయ లోక్‌అదాలత్
మాట్లాడుతున్న ఇన్‌చార్జి జడ్జి రాము
అరకులోయటౌన్: జాతీయ లోక్ అదాలత్ మార్చి 14వ తేదీన నిర్వహించనున్నట్టు అరకులోయ ప్రథమ శ్రేణి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి ఏ.రాము తెలిపారు. స్థానిక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీ, పోలీస్ అధికారులు, లాయర్లతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్‌లో వీలైనంతవరకు కేసులను రాజీ కుదర్చాలని ఏపీపీ, పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీ రమేష్, సీఐ ఎల్.హిమగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్‌ఐలు గోపాలరావు, సురేష్, న్యాయవాదులు మురళీమోహన్, సింహాచలం, రాంబాబు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


