ముంచెత్తిన పొగమంచు
చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉన్నప్పటికీ శీతలగాలులు, పొగ మంచు తీవ్రత యధావిధిగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అరుకులోయలో 9.2 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో ముంచంగిపుట్టులో 10.9 డిగ్రీలు, పెదబయలులో 11.2 డిగ్రీలు, జి మాడుగులలో 13.0 డిగ్రీలు, కొయ్యూరులో 13.5 డిగ్రీలు,అనంతగిరిలో 17.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు.


