యువతకు కుచ్చుటోపీ
రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ సూపర్‌సిక్స్‌లో భాగంగా హామీ ఇచ్చారు. 20 నెలలు గడిచినా ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. అయినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈరెండేళ్ల కాలానికి ప్రతి నిరుద్యోగికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది.
– కోనేటి రామకృష్ణ, మున్సిపల్ వైస్‌చైర్మన్, నర్సీపట్నం


