‘బాకై ్సట్’ వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స
పాడేరు రూరల్: బాకై ్సట్ తవ్వకాలకు వ్యతి రేకంగా పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహరిస్తూ బాకై ్సట్ తవ్వకాలకు సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఉద్య మించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల హామీలు గాలికి వదిలి కార్పొరేట్ శక్తులను పెంచిపోషించేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని చెప్పారు. ప్రధానంగా అరకు, పాడేరు, చింతపల్లి పరిసరాల ప్రాంతాల్లో నిక్షిప్త్తమైన ఉన్న బాకై ్సట్, ఇతర ఖనిజాలను తవ్వేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టు తెలు స్తోందని తెలిపారు. బాకై ్సట్ తవ్వకాలు జరిపితే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరకు, చింతపల్లి అటవీ ప్రాంతాల్లో ఆరు బ్లాకుల్లో చింతపల్లి సపర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజ్ కొండల్లో సుమారు 615 మిలియన్ టన్నుల బాకై ్సట్ నిల్వలు ఉన్నాయని చెప్పా రు. ఏపీఎండీసీ పేరిట లీజులకు ఇచ్చి తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. తక్షణం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాకై ్సట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు దాస్,నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


