అరకు అందాలు అద్భుతం
● ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం
● కుటుంబసభ్యులతో అరకులో
పర్యాటక ప్రాంతాల సందర్శన
అరకులోయ టౌన్: అరకులోయ అందాలు అద్భుతమని ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కటికి జలపాతం, సుంకరమెట్టలోని ఉడెన్ బ్రిడ్జి, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిని తిలకించారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద వారు గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని సెలయేర్లు, కొండలు, లోయలు, సందర్శిత ప్రాంతాలు, ఇక్కడి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని అన్నారు.
అరకు అందాలు అద్భుతం


