అనంతగిరి ఎంపీపీగా మిథుల
అనంతగిరి(అరకులోయటౌన్): అరకులోయ నియోజకవర్గం అనంతగిరి ఎంపీపీగా తడబారికి మిథుల ఎన్నికయ్యారు. ఇక్కడ ఎంపీపీగా పనిచేసిన శెట్టి నీలవేణిపై ప్రవేశపెట్టిన అవిశ్వా స తీర్మానానికి అనుకూలంగా ఎక్కువ మంది ఓటు వేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోయా రు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమ వారం ఎన్నికల అధికారి, మండల ప్రత్యేక అధికారి స్వామినాయుడు ఎన్నిక నిర్వహించా రు. మొత్తం 14 మంది సభ్యులకుగాను ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఎన్నికలకు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ఎన్నికల్లో పాల్గొని మిథులను బలపరిచారు. దీంతో ఆమె ఎంపీపీగా ఎన్నికై నట్టు ప్రకటించి, నియామకపత్రా న్ని అందజేశారు. ఎంపీడీవో ప్రభాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


