ప్రకృతి అందాలు అద్భుతం
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
డుంబ్రిగుడ: చాపరాయి, అరకు పైనరీ వద్ద ప్రకృతి అందాలు అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం మండలంలో అరకు పైనరీ, చాపరాయి పర్యాటక కేంద్రాలను, చేపలమ్మ తల్లి ఆలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాతంలో ఇంతఅందమైన ప్రదేశాలు ఉండడం గిరిజనులకు వరమని తెలిపారు. చాపరాయిని సందర్శించేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, దీనిని అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పించాలన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి మఠం శంకర్, పోతంగి సర్పంచ్ వి.వెంకటరావు, వైఎస్సార్‌సీపీ పోతంగి పంచాయతీ అధ్యక్షుడు కమ్మిడి విజయదశమి, మహిళ నాయకురాలు కమ్మిడి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి అందాలు అద్భుతం


