చిన్నశ్రీనును కలిసిన అనంతగిరి ఎంపీపీ మిథుల
చిన్నశ్రీనుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అనంతగిరి ఎంపీపీ మిథుల, తదితరులు
అనంతగిరి (అరకులోయ టౌన్): విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును అనంతగిరి ఎంపీపీ తడబారికి మిథుల మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతగిరి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసినట్టు ఆమె తెలిపారు. ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకమని ఆయన శుభాకాంక్షలు తెలిపారని ఆమె పేర్కొన్నారు. గిరిజన ప్రజల కోసం, వైఎస్సార్‌సీపీ మరింత పటిష్టతకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారని ఆమె తెలిపారు. ఆమె వెంట ఎంపీటీసీలు శోభ జయశ్రీ, కురిసెలా అరుణ, పార్టీ నాయకులు శోభ చిన్నారావు, తడబారికి జాన్‌బాబు ఉన్నారు.


