పర్యాటక సిరి
అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు.. అది ఒక ఆర్థిక వ్యవస్థ. హోటల్ క్లీనర్ నుంచి ట్యాక్సీ డ్రైవర్ వరకు, చిరు వ్యాపారి నుంచి పెద్ద హోటల్ యజమాని వరకు ప్రతి ఒక్కరికీ పర్యాటకమే జీవనాధారం. ఈ ప్రాంతంలో పర్యాటక మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిస్తే, వేల సంఖ్యలో మరిన్ని కుటుంబాలకు ఉపాధి లభించే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు.
అరకులోయ టౌన్: ప్రకృతి ఒడిలో పచ్చని అందాలతో పరవశింపజేసే అరకులోయ.. కేవలం సందర్శనీయ స్థలమే కాదు, వేలాది కుటుంబాల పాలిట కల్పవృక్షం. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతానికి ఏటా దేశవిదేశీ పర్యాటకులు పోటెత్తుతుండటంతో, ఇక్కడి స్థానికుల ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఏడాది మొత్తం మీద నాలుగైదు నెలలు మాత్రమే పీక్ సీజన్ అయినప్పటికీ, ఆ సమయంలో వచ్చే ఆదాయమే ఏడాది పొడవునా వేలాది కుటుంబాలను పోషిస్తోంది.
హోటళ్లు, లాడ్జిలు ప్రధాన వనరు
అరకులోయలో పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న వారిలో హోటల్, లాడ్జీల యాజమాన్యాలు, కార్మికులు అగ్రభాగంలో ఉన్నారు. ఇక్కడ సుమారు 20 పెద్ద రెస్టారెంట్లు, 10 హోటళ్లు నిరంతరం సేవలందిస్తున్నాయి. వీటిలో సుమారు 400 మంది కార్మికులు పని చేస్తున్నారు.
● అరకు పరిసరాల్లో 100కు పైగా లాడ్జీలు ఉండగా, వీటి నిర్వహణలో దాదాపు 2,500 మంది కార్మికులు భాగస్వాములవుతున్నారు. సుమారు 2,600 కుటుంబాలు కేవలం వసతి రంగంపైనే ఆధారపడి ఉన్నాయి.
● పర్యాటకుల రాకతో రవాణా రంగం ఇక్కడ కళకళలాడుతోంది. సుమారు 160కు పైగా ప్రైవేట్ వాహనాలు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. దీనివల్ల 120 మంది యజమానులు, 130 మంది డ్రైవర్ల కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నాయి. అరకు పట్టణంతో పాటు మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద సుమారు 80కు పైగా ఆటోలు పర్యాటకులపైనే ఆధారపడి నడుస్తున్నాయి.
● ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని తైడా జంగిల్ బెల్స్, బొర్రా గుహలు, అనంతగిరి, అరకులోయ వంటి ఆరు ప్రధాన యూనిట్లలో మరో 300 మంది వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరు కాకుండా, బొర్రా గుహల నుంచి ఎండపల్లివలస రైల్వే స్టేషన్ వరకు ఉన్న చిరు వ్యాపారులు తమ రోజువారీ ఆదాయంలో 50 శాతం పర్యాటకుల నుంచి పొందుతున్నారు
● మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వంటి ప్రాంతా లు కేవలం సందర్శనకే కాదు, వ్యాపారానికి కూడా కేంద్రాలుగా మారాయి. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు వివిధ రకాల చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి.
అరకులోయలో పర్యాటకుల కోసం ఏర్పాటచేసిన రిసార్టులు
గిరిజన మ్యూజియంలో లక్కబొమ్మలు, బ్యాగులను కొనుగోలు చేస్తున్న పర్యాటకులు
వేల కుటుంబాలకు కొండంత అండ
రూ.వందల కోట్లలో వ్యాపారం
సందర్శకుల రాకతో ఊపిరి
ఆంధ్రా ఊటీలో పర్యాటకమే
జీవనాధారం
పర్యాటక సిరి
పర్యాటక సిరి
పర్యాటక సిరి


