ఆరోగ్య జ్యోతి
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వైద్య పరంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంత ప్రజలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక గొప్ప భరోసా కల్పించారు. దశాబ్దాలుగా గిరిజనులు మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతంలోని విశాఖ కేజీహెచ్‌పైనే ఆధారపడేవారు. ఈ దుర్భర పరిస్థితులను చూసి చలించిన జగన్‌మోహన్‌రెడ్డి పాడేరులో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసి.. సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు. కళాశాలలో తరగతులు ప్రారంభమై శుక్రవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం.
గిరిజనుల చెంత
సాక్షి, పాడేరు : సరైన వైద్యం అందక, అత్యవసర పరిస్థితుల్లో కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కేజీహెచ్‌పై ఆధారపడిన గిరిజన ప్రాంతాల కష్టాలకు పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో శాశ్వత పరిష్కారం లభించింది. ఏజెన్సీ ప్రజల దుర్భర పరిస్థితులను చూసి చలించిన గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, 2019 ఎన్నికల హామీ మేరకు పాడేరులో కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు వెచ్చించారు. ఎంతోమంది పాలకులు మారినా గిరిజన ప్రాంత వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైన తరుణంలో ఆయన పట్టుదలతో 70 శాతం నిర్మాణ పనులు పూర్తి చేయడమే కాకుండా, జిల్లా ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో అప్‌గ్రేడ్ చేసి నేడు వందలాది మంది వైద్య విద్యార్థులకు, వేలాది మంది రోగులకు అండగా నిలిచారు. ప్రస్తుతం ఈ కళాశాల రెండు బ్యాచ్‌లతో కళకళలాడుతుండటం చూసి, మన్యం ప్రజలు తమను కంటికి రెప్పలా కాపాడుకున్న అప్పటి సీఎం జగన్‌ను ’గిరిజన వైద్య రక్షకుడిగా’ అభివర్ణిస్తున్నారు.
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కళాశాల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగాయి. 2024 నాటికే సుమారు 70 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. సూపర్ స్పెషాలిటీ భవనం పూర్తి కాకముందే, గిరిజనులకు వైద్య సేవలు త్వరితగతిన అందుబాటులోకి రావాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా సర్వజన ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించారు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, వైద్య, టెక్నికల్ సిబ్బందిని యుద్ధప్రాతిపదికన నియమించారు.
● గత ప్రభుత్వ కృషి ఫలితంగా జాతీయ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు జిల్లా ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది 50 సీట్లతో వైద్య కళాశాల నిర్వహణకు అనుమతులు లభించాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో తరగతులు ప్రారంభమైనప్పటికీ, దీని వెనుక ఉన్న పునాదులు, మౌలిక సదుపాయాలన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమయ్యాయి.
● ప్రస్తుతం మొదటి, రెండో బ్యాచ్‌లకు చెందిన 100 మంది వైద్య విద్యార్థులతో పాడేరు వైద్య కళాశాల కళకళలాడుతోంది. 400 పడకలతో అందుబాటులో ఉన్న సౌకర్యాలు స్థానిక గిరిజనులకు అండగా నిలుస్తున్నాయి.
ఆపద్బాంధవుడు జగన్
మాట తప్పని, మడమ తిప్పని నేతగా గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి తమ గుండెల్లో చెరగని ముద్ర వేశారని గిరిజనులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ, జగన్ హయాంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలే తమకు రక్షణగా ఉన్నాయని, తమ ప్రాంతానికి ఇంతటి పెద్ద సంస్థను తీసుకువచ్చిన ఆయనకు గిరిజన లోకం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
సీట్ల పెంపునకు పోరాటం
పాడేరులో వైద్య కళాశాలను మంజూరు చేసిన అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఓ వైద్యురాలిగా, గిరిజన బిడ్డగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ 50సీట్లకు మాత్రమే ఆడ్మిషన్లు జరుగుతుండడం బాధగా ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి అదనంగా సీట్లు పెంచేందుకు పార్లమెంట్ స్థాయిలో పోరాడుతా.
– గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం
వైద్యకళాశాల అనుమతులకు గాను జిల్లా ఆస్పత్రిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2కోట్లతో అభివృద్ధి చేసింది. జిల్లా ఆస్పత్రిలో గిరిజనులకు కార్పొరేట్ స్థాయిలో ఉన్నత వైద్యాన్ని గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఎంతో మేలు చేసింది .ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని మాజీ సీఎం జగన్ చలవే.
– రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే, అరకు
జగనన్నకు రుణిపడి ఉంటాం
అన్ని రంగాల్లో వెనుకబడిన పాడేరు ఏజెన్సీలో వైద్య కళాశాలను మంజూరు చేసి రూ.500కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడం చారిత్రాత్మకం.వైద్యకళాశాలతో పాడేరుకు ఎంతో పేరొచ్చింది.ఉన్నత వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనులమంతా రుణపడి ఉంటాం.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరు
పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం
గిరిజనుల కల సాకారం చేసిన
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కొండకోనల్లో సువర్ణ అధ్యాయానికి నాంది
తరగతులు ప్రారంభించి నేటికి ఏడాది
ఆరోగ్య జ్యోతి
ఆరోగ్య జ్యోతి
ఆరోగ్య జ్యోతి
ఆరోగ్య జ్యోతి
ఆరోగ్య జ్యోతి


