పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 7:43 AM

పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం

పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం

సీలేరు: స్థానిక విద్యుత్‌ కాంప్లెక్సులో నిర్మించబోయే పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల నష్టం జరిగే ప్రాంతాల్లో గురువారం ఆమె పర్యటించారు. దీనిలో భాగంగా సాండ్‌ కోరి, బూసుకొండ, పార్వతీనగర్‌ గ్రామాల్లో గిరిజనులతో సమావేశమయ్యారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రకారం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ఇల్లు, భూమి కోల్పోతున్న ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాకే భూసేకరణ జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం ఇల్లు, భూమి, ఉద్యోగం ఇస్తారని చెప్పారు. మూడు ప్రాంతాల్లో భూమిని సేకరించి ఇష్టమైన చోటే ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగ ఇస్తామని ఏపీ జెన్‌కో ఎండీ హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి దానికి లెక్క కట్టి మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించేలా ఆమె ఆదేశాలిచ్చారు. నష్టపరిహారం చెల్లింపులో ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉంటున్నారా లేదా అనేది పరిశీలించడమే కాకుండా స్థలాలు ఏశాఖ పరిధికి చెందినవో తెలుసుకునేందుకు సర్వే చేయాలని తహసీల్దార్‌ అన్నాజీరావును ఆదేశించారు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాకే పంప్డ్‌ స్టోరేజీ పనులు చేపట్టాలని స్థానిక గిరిజనులు ఆమెకు విన్నవించారు. అధికారికంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ప్రాజెక్ట్‌ పనులు అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు, ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ హనుమ, మెగా కంపెనీ ఏజీఎం రవిబాబు పాల్గొన్నారు. పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణం వల్ల స్థానిక జెన్‌కో కాలనీలో నివాసితులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని అఖిలపక్ష నేతలు ఇన్‌చార్జి జేసీ, పీవోకు వినతిపత్రం అందజేశారు. డంపింగ్‌ యార్డుకు తరలించే మట్టిని గ్రామం మధ్యంలోంచి తీసుకువెళ్లడం వల్ల షాపులకు ఇబ్బందులు కలుగుతాయని, అలా జరగకుండా చూడాలని వారు పేర్కొన్నారు. చూడాలని కూడా కోరారు.

కొట్టుకుపోయిన వంతెనల పరిశీలన

ధారకొండ పంచాయతీ గంగవరం, డి.అగ్రహారం వంతెలను ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భారీ తుపానుకు కొట్టుకుపోవడం వల్ల రెండువేల మంది గిరిజనులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఐటీడీఏ ఆధ్వర్యంలో బోర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వేకు ఆదేశించామని పీవో తెలిపారు.

ఆ తరువాతనే పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ పనులు

ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో

తిరుమణి శ్రీపూజ

సాండ్‌ కోరి, బూసుకొండ,

పార్వతీనగర్‌ గ్రామాల్లో పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement