పురుగులు పట్టిన బియ్యం.. లెక్కతేలని స్టాక్
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని శివలింగపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతిగృహ నిర్వహణపై ఏపీ పుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సందర్శించిన ఆయన మెనూ ప్రకారం భోజనాలు వండి వడ్డించడం లేదని గ్రహించారు. హెచ్, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాక్ రూమ్‌ను పరిశీలించారు. పూర్తిగా పురుగులు పట్టిన బియ్యాన్ని గుర్తించిన ఆయన వసతిగృహ నిర్వాహకులను ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే వండివడ్డిస్తారా అని ఆగ్రహానికి గురయ్యారు. స్టాక్‌రూంలో 5వేల కిలోలకు బదులు కేవలం 3,600 కిలోలు మాత్రమే బియ్యం ఉండటంపై హెచ్‌ఎం, వార్డెన్‌పై చర్య తీసుకోవడమే కాకుండా వెంటనే కొత్త వారిని నియమించాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పరిమళను ఆదేశించారు. వసతి గృహ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముదుగా కాశీపట్నం అంగన్‌వాడీ కేందాన్ని పరిశీలించిన ఆయన పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని, రికార్డులను తనిఖీ చేశారు.
శివలింగపురంలో అధ్వానంగా
ఆశ్రమ వసతి గృహ నిర్వహణ
ఆగ్రహానికి గురైన ఫుడ్ కమిషన్
సభ్యుడు కృష్ణ కిరణ్
హెచ్‌ఎం, వార్డెన్‌పై చర్యలకు ఆదేశం


