మా వంటలకు మంచి డిమాండ్
13 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పైనే బ్యాంబు చికెన్, బిర్యానీ వ్యాపారం చేస్తున్నా. సీజన్‌లో రోజుకు 15 కిలోల వరకు చికెన్ ఐటెమ్స్ అమ్ముడవుతాయి. పర్యాటకులు రావడం వల్లే ఆర్థికాభివృద్ధి పొందగలిగాం.
– సిసా సిరి, చిరు వ్యాపారి
ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టత ఇవ్వాలి
ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ప్రచారం జరగడంతో పర్యా టకులు రావడానికి భయపడుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే సంక్రాంతి సీజన్‌లో మా వ్యాపారాలు నిలబడతాయి.
– ఎన్. రమేష్,
అధ్యక్షుడు, రెస్టారెంట్ల ఓనర్ల అసోసియేషన్
పర్యాటకమే అండ..
బీఏ చదివినా ఉద్యోగం లేక ఇబ్బంది పడ్డా. గత ఎనిమిదేళ్లుగా రిసార్ట్ మేనేజర్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. పర్యాటకం వల్లే నాలాంటి ఎన్నో కుటుంబాలకు చెందిన యువతకు ఇక్కడ ఉపాధి దొరుకుతోంది.
– బిమిడి బుజ్జిబాబు, రిసార్ట్ మేనేజర్
పర్యాటకులపైనే ఆధారం
అరకులో లాడ్జీలపై 2,500 కుటుంబాలు జీవిస్తున్నా యి. పర్యాటకులు రాకపోతే వీరందరికీ జీతాలు ఇవ్వ లేం. టూరిజాన్ని ప్రోత్సహించాలి తప్ప, అడ్డుకోకూడదు.
– ఎంటీఆర్ సాంబయ్య,
అధ్యక్షుడు, లాడ్జీ ఓనర్ల అసోసియేషన్
ఆంక్షలు తొలగించాలి
స్థానికులు ఎవరూ కార్లు కిరాయికి తీసుకోరు. కేవలం ప ర్యాటకులపైనే మా 250 కు టుంబాలు ఆధారపడి ఉన్నా యి. ప్రభుత్వం ఆంక్షలు విధి స్తే ఫైనాన్స్ కట్టలేం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వం పునరాలోచించాలి. – పాంగి నాగార్జున, అధ్యక్షుడు,
వాయుపుత్ర మోటార్ యూనియన్
ముప్పై ఏళ్లుగా ఇదే జీవితం..
32 ఏళ్లుగా అరకు మెయిన్ రోడ్డుపై టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. సీజన్‌లో రోజుకు రూ. 12 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోతోంది.
– ఎస్. లక్ష్మి, టిఫిన్ సెంటర్ యజమానురాలు
మా వంటలకు మంచి డిమాండ్
మా వంటలకు మంచి డిమాండ్
మా వంటలకు మంచి డిమాండ్
మా వంటలకు మంచి డిమాండ్
మా వంటలకు మంచి డిమాండ్


