పూర్వీకుల నుంచి సంత నిర్వహిస్తున్నాం
ప్రతీ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పురస్కరించుకొని జి.మాడుగులలో తారుమారు సంతను మత్స్యరాస వంశీయులు అధ్వర్యంలో నిర్వహించటం అనవాయితీగా వస్తోంది. సంతకు వచ్చే వ్యాపారులు, గిరిజన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశాం. బంధుమిత్రులతో కలిసి పండుగ ముచ్చట్లు పంచుకోవడం, సంక్రాంతికి ఒకరినొకరు ఆహ్వానించుకోవడం ఈ సంత ప్రత్యేకత. గిరిజన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం.
– మత్స్యరాస నాగరాజు,
నిర్వహణ కమిటీ ప్రతినిధి, తారుమారు సంత, జి.మాడుగుల


