చిన్నారి మృతిపై గిరిజనుల ఆందోళన
చింతపల్లి: వైద్యం వికటించడంతోనే రెండు నెలల శిశువు మృతి చెందాడని ఆరోపించారు. దీనిలో భాగంగా శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద బాధిత తల్లిదండ్రులతో వారు ఆందోళన నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్ డిసెంబర 31న మండలంలోని చౌడుపల్లి పంచాయతీ చెదలపాడు గ్రామానికి చెందిన తాంబెలి చిట్టిబాబు, రాజేశ్వరి దంపతుల రెండునెలల బాబు అస్వస్థతకు గురయ్యాడు. అతనిని తల్లిదండ్రులు అదే రోజు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నపిల్లల వైద్యురాలు సూచనల మేరకు వైద్యసిబ్బంది చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో శిశవును నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రెండునెలల బాబు మరణించాడు. ఈఘనటకు చింతపల్లి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని బాధిత చిన్నారి తల్లిదండ్రులు, పలువురు గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులతో డీసీహెచ్‌ఎస్ నీలవేణి మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపట్టి కమిషనర్‌కు నివేదిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాబూరావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు, చిరంజీవి, సాగిన కృష్ణపడాల్ బాలరాజు పాల్గొన్నారు.
చింతపల్లి ఏరియా ఆస్పత్రి వైద్యులనిర్లక్ష్యమేనని ఆవేదన
విచారణ చేపడతామని
డీసీహెచ్‌ఎస్ నీలవేణి హామీ
శాంతించిన ఆందోళనకారులు
చిన్నారి మృతిపై గిరిజనుల ఆందోళన


