నెలలు నిండకుండానే ప్రసవం
● అరకిలో బరువుతో శిశువు జననం
● మెరుగైన వైద్యం కోసం చింతపల్లి
ప్రభుత్వాస్పత్రికి తరలింపు
● చేరుకుమల్లులో ఘటన
సీలేరు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి ప్రసవించగా.. పుట్టిన బిడ్డ కేవలం అర కేజీ (500 గ్రాములు) మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గూడెంకొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలోని చేరుకుమల్లులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లంకి రవి, రత్నం దంపతులు ఉపాధి కోసం ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఒక రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లారు. అ క్కడ గర్భం దాల్చిన రత్నం, ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా, మందులు వాడకుండా నిర్లక్ష్యంగా ఉంది. గత నెల 27న వారు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆరో నెల గర్భంతో ఉన్న రత్నానికి సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఇంట్లోనే ప్రసవించింది. పుట్టిన శిశువు అత్యల్ప బరువుతో పాటు, అవయవ లోపంతో ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు భయాందోళన కు లోనయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త వెంటనే ఏఎన్‌ఎంకు సమాచారం అందించారు. వా రు హుటాహుటిన బాధితుల ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంత రం తల్లీబిడ్డను ధారకొండ ఆసు పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ బాబ్జి శిశువు పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించడం కోసం శనివారం చింతపల్లి ప్రభు త్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ వైద్యు ల పర్యవేక్షణలో ఉన్నారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.


