గిరిజనులకు అప్పన్న చిత్రపటాలు, దుస్తుల అందజేత
సింహాచలం: అల్లూరి జిల్లాలో శ్రీనృసింహ దీక్ష చేపట్టిన పలువురు భక్తులకుి సింహాచలంలోని సింహాద్రి మఠం తరఫున శనివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు, దుప్పట్లు, తువ్వాళ్లు గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి అందజేశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని బంగారు మెట్ట దరి సరియాపల్లి, పెదబయలు మండలం గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామంలో వీటిని అందజేశారు. సింహాచలం దేవస్థానం సౌజన్యంతో పూజా విధానం పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజ చేసి, భక్తి గీతాలు ఆలపించారు.


