సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
● అధికారుల గైర్హాజరుపై సభ్యుల ధ్వజం
అడ్డతీగల: సమావేశాల్లో చర్చించిన అంశాలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపకపోవడంపై అడ్డతీగల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. మండల సర్వసభ్య సమావేశం శనివారంఎంపీపీ బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన శనివారం జరిగింది. గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు చెబుతున్నా అధికారులు వాటిని పెడచెవిన పెడ్తున్నారన్నారు. రోడ్ల పనులకు అనుమతులు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని డీఈ నాగరాజుని సభ్యులు నిలదీశారు. మ్యూటేషన్‌లు జరగక రైతులకు పథకాలు అందడం లేదన్నారు. మిట్టపాలెంలో డీఆర్ డిపో ఏర్పాటుచేయాలని, గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరష్కరించాలని సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. ఎకై ్సజ్ శాఖ తరఫున హెచ్‌సీ సమావేశానికి వచ్చి ఎకై ్సజ్ శాఖ కేసులను వివరించారు. ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ ప్రతి శాఖకు చెందిన అధికారులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, తహసీల్దార్ దొరకయ్య, వైస్ ఎంపీపీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
గంగవరం: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రెండేన్నరేళ్లుగా గౌరవ వేతనం మంజూరు చేయడంలేదని సభ్యులు ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ బేబీ రత్నం మాట్లాడుతూ మండలం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు చెల్లించిక పోవడం అన్యాయమని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీవో లక్ష్మణరావు సభ్యులను కోరగా సభ్యులు శాంతించారు. ఆయా శాఖల అధికారులు ప్రగతిని సమావేశంలో వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన 17 మంది సర్పంచ్‌లను సన్మానించారు.
వైస్ ఎంపీపీలు రామతులసి , గంగాదేవి, ఎంపీటీసీ సభ్యులు ఆదినారాయణ, కనకలక్ష్మి, పద్మావతి, వెంకటలక్ష్మి కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, ఎంపీడీవో లక్ష్మణరావు, వైద్యాధికారి భావన, ఏవో విశ్వనాథ్ , ఎంఈవో మల్లేశ్వరరావు, ఏపీఓ ప్రకాష్ , ఏపీఎం అప్పలకొండ , డిప్యూటీ ఎంపిడీవోలు నరసింగరావు, గోపి, సర్పంచ్‌లు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చింతూరు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సవలం అమల అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళీ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలని కోరారు. పాడైన అంగన్‌వాడీ భవనాలకు మరమ్మతు చేయాలని, రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలని, ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు. వైస్ ఎంపీపీ యడమ అర్జున్, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు


