జూన్ నాటికి సీలేరు రోడ్డు పనులు పూర్తి
ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులు
రోడ్డు పనులను పరిశీలిస్తున్నఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు
సీలేరు: గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మీదుగా అంతర్రాష్రాలకు వెళ్లే ధారాలమ్మ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయరాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారి దుస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన ‘ప్రయాణం..భయం భయం’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్ నుంచి లంకపాకల గ్రామం వరకు రూ.8.70 కోట్లు, అలాగే రైన్ గేజ్ నుంచి ధారాలమ్మ ఆలయం వరకు రూ. 2.95 కోట్లు, సీలేరు నుంచి పాలగడ్డ వరకు రూ.2 కోట్ల మేర ఎస్‌డీఎంఎఫ్ ద్వారా నవంబర్, 2024లో నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. అయితే ఈ రహదారిని మూడు భాగాలుగా ఒకే కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. ఆర్‌వీ నగర్ నుంచి లంకపాకల గ్రామాల మధ్య అక్టోబర్‌లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని, ఒప్పందం ప్రకారం జూన్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.
జూన్ నాటికి సీలేరు రోడ్డు పనులు పూర్తి
జూన్ నాటికి సీలేరు రోడ్డు పనులు పూర్తి


