అవకాశాలను అందిపుచ్చుకోవాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. 2025లో నిర్వహించిన ఎన్‌ఐటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురం గ్రామానికి చెందిన శెట్టి అఖిల్ అనే గిరిజన విద్యార్థికి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ల్యాప్‌టాప్‌ను ఆమె అందజేశారు. గిరిజన విద్యార్థి అఖిల్ ఎన్‌ఐటీ పరీక్షల్లో 96 శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గొప్ప విషయమన్నారు. అసోం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో అత్యంత డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ విభాగంలో సీటు దక్కించుకున్నాడని చెప్పారు. గిరిజన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని సరైన ప్రోత్సహంతోనే అది బయటపడుతుందన్నారు. ఉన్నత చదువుల్లో మెరుగ్గా రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆమె ఆకాక్షించారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో హేమలత పాల్గొన్నారు.
ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్,
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
ఎన్‌ఐటీలో సీటు సాధించిన గిరిజన విద్యార్థికి అభినందన
ల్యాప్‌టాప్ అందజేత


