అంబులెన్సులకుమరమ్మతులు చేపట్టాలి
● పాడేరు ఐటీడీఏ పీవోను కోరిన
అరకు ఎంపీ తనూజరాణి
సాక్షి,పాడేరు: ఐటీడీఏ పరిధిలో మరమ్మతులతో మూలకు చేరిన అంబులెన్స్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కోరారు. శుక్రవారం ఆమె, భర్త చెట్టి వినయ్ శుక్రవారం పీవోను మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాడేరు ఐటీడీఏ పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ఎంపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనేక పీహెచ్‌సీలకు చెందిన అంబులెన్స్‌లు చిన్నపాటి మరమ్మతులతోను ఐటీడీఏ గ్యారేజ్‌లో మూలకు చేరాయన్నారు. వీటి మరమ్మతులకు ఐటీడీఏ నిధులు మంజూరు చేయాలని ఎంపీ కోరారు.


