ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
● తీవ్ర గాయాలైన నలుగురికి విశాఖ కేజీహెచ్‌కు తరలింపు
● స్వల్పగాయాలైన ఇద్దరికి అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స
అరకులోయటౌన్: అరకు–విశాఖ రోడ్డులో పానిరంగిని గ్రామం వద్ద శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో–బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సంఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో బస్కీ పంచాయతీ దేవరాపల్లి నుంచి అరకులోయకు వస్తున్న ఆటో, అరకులోయ నుంచి విశాఖ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొన్నాయి. బైక్‌పై వెళ్లున్న మండలంలోని రవ్వలగుడ గ్రామానికి చెందిన బురిడి జోయో(31)కు ఎడమ చెయ్యి విరిగింది. డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ కుసుమగుడ గ్రామానికి చెందిన కొర్రా కృష్ణ(29)కు మొహాం, కుడి చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న బస్కీ పంచాయతీ దేవరాపల్లికి చెందిన బాక అనిల్ కుమార్(16)కు కుడి చెవి నుంచి రక్తస్రావమవుతుంది.
దేవరాపల్లికి చెందిన కిల్లో సల్మాన్(17)కు నడుముపై బలమైన గాయమైంది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న అరకులోయ మండలం మాదల గ్రామానికి చెందిన పాంగి బంగార్రాజు(25)కు కుడి భుజం, తల వెనుక భాగం, బస్కీ పంచాయతీ దుంగియాపూట్‌కు చెందిన పాంగి హరిత(18)కు కుడికాళ్లుల, తలపై స్వల్పగాయాలైంది. తీవ్రగా యాలైన కొర్రా కృష్ణ, బి.అనిల్ కుమార్, సల్మాన్, జోయోలకు మెరుగైన వైద్యం కొసం విశా ఖ కేజిహెచ్‌కు తరలించినట్లు వైద్యులు గీత, బాలాజీ తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు


