వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
చింతూరు: మద్యం మత్తులో ఒకరు, కడుపునొప్పి తాళలేక మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు ఎస్‌ఐ రమేష్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. మండలంలోని బొడ్రాయిగూడెంకు చెందిన శ్యామల రామయ్య(38) తీవ్రమైన కడుపునొప్పిని తాళలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిట్టల మందు తాగాడు. భార్య లక్ష్మి సాయంత్రం ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలో పడివున్న భర్తను గమనించి బంధువుల సాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించింది. రామయ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం మత్తులో..
మండలంలోని సూరకుంటకు చెందిన తోడం ముద్దరాజు (16) గతనెల 30న పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంట్లో ఉంచిన పురుగు మందును సేవించినట్లు ఎస్‌ఐ తెలిపారు. దీంతో ముద్దరాజు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన అతని నానమ్మ తోటివారి సాయంతో ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం భద్రాచలం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రామయ్య, ముద్దరాజు మృతదేహాలు
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య


