జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకుఇద్దరు ఎంపిక
నర్సీపట్నం: జాతీయ స్థాయి మహిళా బాక్సింగ్ టోర్నమెంట్‌కు నర్సీపట్నానికి ఇద్దరు సీనియర్ మహిళలు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని గ్రేటర్ నోయిడాలో జరిగే ఈ పోటీల్లో 75 కేజీల విభాగంలో బొంతు మౌనిక, 80 కేజీల విభాగంలో యర్రా తేజస్విని పాల్గొననున్నారు. గత నెల కాకినాడ జిల్లాలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారని కోచ్ అబ్బు తెలిపారు. నేషనల్ స్థాయిలో ఇద్దరు విజయాలు సాధించి నర్సీపట్నానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. నింజాస్ అకాడమీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సతాపల్లి శ్రావణి, వెలగా నారాయణరావు, వెలగా జగన్నాథ్, శ్రీకాంత్, సురేష్ అకాడమి తరుపున ట్రాక్ సూట్‌లు అందజేశారు.


