పర్యాటక ప్రాంతాల్లో న్యూఇయర్ జోష్
పెదబయలు: న్యూఇయర్ సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. గురువారం నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా జిల్లాలోని చాపరాయి, బొర్రా గుహలు, లంబసింగి, జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల సరిహద్దు ప్రాంతాల్లోని తారాబు (పిట్టలబొర్ర) జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. చలితీవ్రతను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా గడిపారు. జలపాతాల వద్ద సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ పర్యాటకులు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా పోలీసులు, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి గురువారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు బస్సులు, కార్లు వివిధ వాహనాల్లో భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. జలపాత ప్రాంతాల్లో బండరాళ్లపైనుంచి జాలువారే ప్రవాహంలో కేరింతల కొడుతూ గంటలు తరబడి స్నానాలు చేశారు.
భారీగా తరలివచ్చిన సందర్శకులు
పర్యాటక ప్రాంతాల్లో న్యూఇయర్ జోష్


