మోదమ్మ ఆలయం కిటకిట
● పోటెత్తిన భక్తజనం
● దర్శించుకున్న ఇన్‌చార్జి జేసీ
తిరుమణి శ్రీపూజ
సాక్షి,పాడేరు: ఉత్తరాంఽఽధ్ర ప్రజల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తుల పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం లోకకల్యాణార్థం కుంకుమార్చన నిర్వహించారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విఽశ్వేశ్వరరాజు,ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.


