ఆటో బోల్తా – 9 మందికి గాయాలు
కొమ్మాది : ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే రహదారిలో డివైడర్‌ను ఢీకొని ఓ ఆటో బోల్తా పడింది. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆర్‌ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం మధురవాడ ప్రాంతానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆటోలో రుషికొండ బీచ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పలువురు ప్రయాణికులు వారిని గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో రోడ్డులో వాహనాలు ఏమి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే విధంగా గురువారం తెల్లవారుజామున భీమిలి నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి అదుపు తప్పి తిమ్మాపురం సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ధ్వంసం కాగా డివైడర్ మధ్యలో ఉన్న చెట్టు వాలిపోయింది. కారులో ఉన్న వారికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.


