● ప్రాణాలతో చెలగాటం
గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు జీపులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఇష్టానుసారంగా ఎక్కించుకొని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. పరిమితికి మించి ఎక్కించడమే కాకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సొలభం, వంజరి వంటి ప్రమాదకర ఘాట్ రోడ్లలో మలుపుల వద్ద వాహనం నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం వైట్ బోర్డు (సొంత వాహనాలు) గల వాటిని కమర్షియల్ ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– జి.మాడుగుల


