బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా
పాడేరు రూరల్: నూతన సంవత్సర వేడుకలో భాగంగా పాడేరు కేంద్రంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం బాటిళ్లను ఆటోలు, వివిధ వాహనాల్లో బుధవారం భారీగా తరలించారు. పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు వస్తాయనే నేపంతోనే ముందస్తుగా వైన్ షాపుల నిర్వాహకులు పాడేరు, సమీప గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం తరలించినట్టు పలువురు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా జరగనున్నట్టు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అదనపు ధరలకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు, ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.


