అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వొద్దు
● చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
గూడెంకొత్తవీధి: నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఎక్కడా కోడిపందాలు, పేకాటలు వంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా అన్నారు. గూడెంకొత్తవీధి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ సుధాకర్, ఎస్‌ఐ సురేష్‌లు మర్యాదపూర్వకంగా పూలమొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్‌లో నమోదైన కేసులు, భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులను అందజేశారు.


