పక్కాగా వంద రోజులప్రణాళిక అమలు
● జిల్లా విద్యాశాఖ అధికారిరామకృష్ణారావు ఆదేశం
డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్షల్లో లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు పక్కగా వంద రోజుల ప్రణాళిక అమలుకు కృషి చేయాలని జిల్లావిద్యాశాఖాధికారి రామకృష్ణారావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూ ర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. యాక్షన్ అమలుతీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారులు శెట్టి సుందర్‌రావు, జి గెన్ను పాల్గొన్నారు.


