విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి
చింతపల్లి: నేటి తరంలో విద్యార్థుల భావి భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పీఆర్‌టీయూ డైరీ, క్యాలెండర్‌ను జిల్లా అధ్యక్షుడు యువి గిరితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనపైనే చిన్నారుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు మత్స్యలింగం, సత్తిబాబు, అప్పారావు, శామ్యూల్, గిరిజారాణి, కృష్ణకుమారి, మంగకుమారి, దామోదర్ పాల్గొన్నారు.
డుంబ్రిగుడ/పాడేరు రూరల్: డుంబ్రిగుడ, పాడేరు ప్రాంతాల్లో బుధవారం పీఆర్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్‌ల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో డుంబ్రిగుడలో ఎంఈవోలు శెట్టి సుందరరావు, జి.గెన్ను, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, పాడేరులో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు డి.బాబురావు, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు జగన్‌మోహనరావు, శ్యాంసుందరం, పోతురాజు, కై లాసం, సోమినాయుడు, ధనుంజయ్ కన్నయ్య, బాలకృష్ణ, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్సీ నవజ్యోతి మిశ్రా
విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి
విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి
విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి


