గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాల సమీపంలో మత్స్యగెడ్డలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది.స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో మృతదేహాన్ని పోలీసు సిబ్బంది గెడ్డ నుంచి బయటకు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ వెంకటేష్ మాట్లాడుతూ వృద్ధురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గెడ్డ నుంచి ప్రధాన రోడ్డు వరకు పెదబయలు సివిల్ కానిస్టేబుల్ వెంకట్, ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ మనోహర్‌నాయుడు, సివిల్ హెడ్ కానిస్టేబుల్ నారాయణలు సుమారు కిలోమీటర్ వరకు మోసుకొచ్చి , మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో పెదబయలు పీహెచ్‌సీకి తరలించినట్టు తెలిపారు. పోలీసు సేవలను అభినందనించారు. అయితే వృద్ధురాలి మృతదేహం ఆచూకీ తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేష్ చెప్పారు. మృతదేహం తరలింపులో సర్పంచ్ పలాసి మాధవరావు, ఎంపీటీసీ సభ్యుడు బొంజుబాబు, రెవెన్యూ సిబ్బంది సుందర్‌దేవ్, తదితరులున్నారు.
మృతదేహాన్ని బయటకు తీసి
మోసుకొచ్చిన పోలీసులు
గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం


