రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవిపై ఫిర్యాదు
మిగతా 8వ పేజీలో
వై.రామవరం: తమ నాయకుడు, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ప్రాణాలకు ముప్పుతెచ్చే వ్యాఖ్యలు చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే (టీడీపీ) మిరియాల శిరీషదేవిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ పృథ్వీయాదవ్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే శిరీషదేవి రంపచోడవరంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తమ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉద్దేశపూర్వకంగా ఏకవచనంతో నానా మాటలు అన్నారన్నారు. ఒక ఎమ్మెల్సీ అనికూడా చూడకుండా అనంతబాబు ఇంటికి జనాన్ని పంపించి కొట్టిపారేయిస్తాననడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, అనంతబాబు ప్రాణాలకు ముప్పువచ్చే విధంగా ఆమె ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఇలా ఈ ఒక్కసారే కాకుండా అనేక సార్లు భయభ్రాంతులను చేసేలా మాట్లాడారన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే విధంగా ఎమ్మెల్యే శిరీషదేవి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే శిరీషదేవిపై భారతీయ న్యాయ


