నీలాకాశంలో రెండో చందమామ | - | Sakshi
Sakshi News home page

నీలాకాశంలో రెండో చందమామ

Dec 31 2025 7:16 AM | Updated on Dec 31 2025 7:16 AM

నీలాకాశంలో రెండో చందమామ

నీలాకాశంలో రెండో చందమామ

● నింగిలో మెరిసిన ‘హైడ్రోజన్‌’ వెన్నెల ● కొత్త ఏడాది వేళ అదిరిపోయేలా ఏర్పాట్లు

రాజవొమ్మంగి: చూడగానే.. అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా?.. అని ఆశ్చర్యపోక తప్పదు. నింగిలో ఆ గుండ్రటి ఆకారం, ఆ వెలుగు చూస్తే ఎవరైనా పొరబడాల్సిందే. కానీ అది నిజమైన చందమామ కాదు.. నూతన సంవత్సర వేడుకల కోసం రాజవొమ్మంగిలో ఆకాశంలో కొలువుదీరిన ’కృత్రిమ జాబిల్లి’. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పాలనుకున్న ఓ ఔత్సాహికుడు వినూత్నంగా ఆలోచించారు. సుమారు రూ. 30 వేల ఖర్చుతో భారీ హైడ్రోజన్‌ బెలూన్‌ను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి దీనిని గాలిలోకి ఎగురవేయగా, చీకటి ఆకాశంలో అది పసుపు రంగులో చందమామలా మెరుస్తూ చూపరులను కట్టిపడేసింది. గ్రామస్తులంతా ఆసక్తిగా ఈ ’హైడ్రోజన్‌ వెన్నెల’ను తిలకించారు. కేవలం వేడుక కోసమే కాకుండా, విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత ఖర్చు చేసి ఈ బెలూన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు స్థానికంగా వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement