కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
● హరినామస్మరణతో మార్మోగిన ఆలయాలు
● భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరి నామస్మరణతో వైష్ణవాలయాలు మార్మోగాయి. ఉత్తరద్వారం గుండా ఆ వైకుంఠనాథుని దర్శించుకునేందకు మంగళవారం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే జిల్లాలో పలు ఆయాలకు భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకుని తరంచారు. అలౌకికానందంతో తన్మయుల్యారు .
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని గిరి కై లాస క్షేత్రంలోని వైభవ వేంకటేశ్వరస్వామితో పాటు సుండ్రుపుట్టులోని వేంకటేశ్వరస్వామి, వెంకటగిరి మెట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి,అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు అనంతరం మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నరసింగరావుతో పాటు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు కొట్టగుళ్లి రమాదేవి, కాత్యాయని, వెంకటరత్నం, వైదేహి తదితరులు భగవద్గీత పుస్తకాలు, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. వెంకటగిరి మెట్టపై భారీ అన్నసమరాధనను నిర్వహించారు.అరకులోయలోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయంలోను ముక్కోటి ఏకాదశని ఘనంగా నిర్వహించారు.
రంపచోడవరంలో
రంపచోడవరం : ఐ.పోలవరం గోవిందగిరిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి సతీసమేతంగా పాల్గొని పూజలు జరిపారు. ఆలయ అర్చకులు పార్థుస్వామి, మణికంఠస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, గోకవరం తదితర సదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠద్వారంనుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ అధికారులు రూపు సాయి, గోవింద గిరి శ్రీవారి సేవా బృందం సమన్వయ కర్త నల్లమిల్లి వేంకటరామారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
చింతపల్లి: మండలంలోని పలు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించా రు. అంతర్ల అనాదీశ్వర ఆలయంలో శివానంద మాతాజీ, అర్చకులు వినోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌడ, వంగసార, శివాలయాలతో పాటు గొందిపాకలు,తాజంగి,చింతపల్లి రామాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అంతర్ల శివాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 24 గంటల పాటు ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ భజన కార్యక్రమంలో మండలంలో గల 10 భజన బృందాలు పాల్గొన్నాయి.ఆలయంలో పూజలు నిర్వహించిన భక్తులకు అన్నసమారాధన జరిపి, ప్రసాదాలను పంపిణీ చేశారు.
అడ్డతీగల: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.
పాత రామాలయంలో ఏకాహం
అడ్డతీగలలోని పాత రామాలయంలో కొలువైన సీతారామచంద్రస్వామి వార్లను వివిధ రకాల పుష్పాలు,తులసి మాలలతో అలంకరించి పూజాధికాలు నిర్వహించారు.అనంతరం సీతారామాలయంలో ఉదయం 6 గంటల నుంచి ఏకాహం ప్రారంభించారు.
జి.మాడుగుల: సింగర్భ పంచాయతీ గొడ్డుబూసులు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుడు ఐసరంగి రామకృష్ణ,దేవుళ్ళునాయుడు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానిక రామాలయం, గాంధీనగరం గ్రామంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మత్స్య మాడుగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ రీమెలి అప్పలరాజు, ధర్మ రక్ష దివస్ స్వామి సచ్చానంద లక్ష్మణ్ స్వామిజీ తదితరులు పాల్గొన్నారు.
సీలేరు: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సీలేరు, దారకొండలలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీలేరులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.స్థానిక రామాలయం ఆలయంలో ఆకాశదీప పూజలను నిర్వహించి కుంకుమ పూజలు కోలాటం. దారకొండలో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు.
రాజవొమ్మంగి: స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం లక్ష తులసి పూజ, ప్రసాదవితరణ జరిపారు.
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం


