బ్లైండ్ క్రికెటర్ కరుణకుమారికి ఘన సత్కారం
మంచు కొండల్లో వేడివేడి విందు
●హరితా రిసార్ట్‌లో ప్రత్యేక వంటకాలు
చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగిలోని పర్యాటకశాఖ హరితా రిసార్ట్‌లో నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేస్తున్నట్లు రిసార్ట్ మేనేజర్ ఎస్. అప్పలనాయుడు తెలిపారు. ఇక్కడి వచ్చే పర్యాటకులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కోడికూర, రాగి సంగటి, కుండ బిర్యాని (వెజ్, నాన్‌వెజ్) తయారు చేస్తున్నట్లు తెలిపారు.
నిప్పుల కుంపటి తెచ్చిన ముప్పు
గూడెంకొత్తవీధి: చలి నుంచి ఉపశమనం కోసం వారు వేసుకున్న నిప్పుల కుంపటి, ఆ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తలుపులు మూసి నిద్రించడంతో విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన ఘటన సోమవారం రాత్రి నక్కలమెట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నక్కలమెట్ట గ్రామానికి చెందిన కొర్రా రాంబాబు (50), కొర్రా లక్ష్మి (45) దంపతులు సోమవారం రాత్రి చలి ఎక్కువగా ఉండటంతో ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకున్నారు. గది చిన్నది కావడంతో పాటు, చలి గాలి రాకుండా తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి నిద్రపోయారు. మంట నుంచి వెలువడిన బొగ్గు పులుసు వాయువు గది నిండా వ్యాపించడంతో, ఆక్సిజన్ అందక వారు నిద్రలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వీరిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


