పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు

Dec 30 2025 7:20 AM | Updated on Dec 30 2025 7:20 AM

పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు

పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు

మిగతా 8వ పేజీలో

ఈ ఏడాది నేర సమీక్ష వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్‌

పాడేరు: గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, హత్యాయత్నం కేసుల సంఖ్య పెరిగింది.గత ఏడాది 164 రోడ్డు ప్రమాదాలు జరగా, ఈ ఏడాది 176 ప్రమాదాలు జరిగాయి. పోలీస్‌ శాఖ తీసుకున్న చర్యల కారణంగా మిగతా నేరాలు అదుపులోకి వచ్చాయని, వివిధ విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్‌ రేట్‌ 34 శాతం తగ్గిందని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని ఆయన చెప్పారు. వార్షిక నేర సమీక్ష వివరాలను స్థానిక జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ఏడాది 2,304 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 1,502 కేసులు నమోదైనట్టు చెప్పారు.

● జిల్లాను గంజాయి రహితంగా మార్చినట్టు ఆయన చెప్పారు. గత ఏడాది 316 గంజాయి కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నమోదైన 135 కేసుల్లో 14,484 కిలోల గంజాయి, 35.61 లీటర్ల హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకుని, 358 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామని చెప్పారు. రూ.4.41 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, 11 కేసుల్లో శిక్షలు ఖరారైనట్టు ఆయన చెప్పారు. ఆరుగురు అంతరాష్ట్ర మోస్ట్‌ వాంటెడ్‌ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. మొత్తం మీద 56శాతం గంజాయి కేసులు తగ్గాయన్నారు.

● జిల్లాలో మావోయిస్టు కార్యకలపాలను పూర్తిగా నిర్మూలించామన్నారు. ఈ ఏడాది 18 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో కేంద్ర, రాష్ట్ర, డివిజన్‌ కమిటీలు, ఏవోబీ క్యాడర్‌కు చెందిన కీలక మావోయిస్టులు హతమయ్యారన్నారు. తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, మరో 49 మంది జిల్లాలో స్వచ్ఛందంగా లొంగిపోయారని చెప్పారు. ఐదు చోట్ల మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకున్నామని, మావోయిస్టు పార్టీలో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.

● జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న హైవే కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త పెరిగిందన్నారు. మోతుగూడెం ప్రాంతంలో జరిగిన బస్సు యాక్సిడెంట్‌తో పాటు మరికొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement