‘ఆర్గానిక్’ పరిశ్రమల ఏర్పాటుకు చొరవ
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ దినే ష్‌కుమార్ సూచించారు. సోమవారం తన చాంబర్‌ను నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే భూమి కేటాయిస్తామన్నారు. ఆసక్తి గల పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాలైన అరకు, పాడేరు, మారేడుమిల్లి తదితర చోట్ల క్యార్‌వ్యాన్లు, రిసార్ట్స్, కాటేజీలు, క్రీడా పార్క్‌ల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టి, గ్రామ సభల తీర్మానాల ద్వారా గ్రామ పంచాయతీల నుంచి ఆమోదం తీసుకుని సంబంధిత యాజమన్యాలకు అప్పగించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చింతపల్లి, గంగవరంలలో ఎంఎస్‌ఎం పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య శిక్షణ, వర్క్‌షాపు నిర్వహించాలని, ఉదయం పోర్టల్‌లో శిక్షణ పొందిన వారి సమాచారం పొందుపరచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన అభ్యర్థులు ఉపాధి పొందేందుకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వర్చువల్‌గా జీసీసీ ఎండీ కల్పనా కుమారి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు స్మరణ్‌రాజ్, శుభం నొక్వాల్, పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు.


