గేటు పడితే ఇబ్బందే
అరకులోయ–పాడేరు ప్రధాన రహదారిలో కురిడి వద్ద రైల్వేగేటు పడితే రైలు వెళ్లేవరకు నిరీక్షించడం ఇబ్బందిగా ఉంది. గూడ్స్ రైళ్లకు వ్యాగిన్‌లు అధికంగా ఉండడంతో రైలు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈ ట్రాక్‌పై రైళ్లు ఎక్కువుగా నడుస్తుండడంతో అత్యవసర సమయంలో స్థానికులమంతా ఇబ్బందులు పడుతున్నారు.
– పాంగి జీనబందు, వాహన చోదకుడు, కొర్రాయి పంచాయతీ డుంబ్రిగుడ మండలం
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి
జాతీయ రహదారి కావడంతో అరకులోయ–పాడేరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. కురిడి రైల్వేగేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలకు ఇబ్బందిగా మారింది, ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.
– ముఖీ సాంబ,
మోటార్ యూనియన్ నాయకుడు, అరకులోయ
గేటు పడితే ఇబ్బందే


